ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం వైద్యుల సమస్యలు పరిష్కరించాలి: నారా లోకేష్​

కరోనా సంక్షోభంలో ముందుండి పోరాడుతున్న వైద్యుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఆసుపత్రి సిబ్బంది ధర్నా చేసే పరిస్థితికి తీసుకొచ్చిందన్నారు.

lokesh demands to solve doctors problems
వైద్యుల సమస్యలపై నారా లోకేశ్

By

Published : Jun 29, 2020, 7:34 PM IST

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. సంక్షోభ సమయంలో ముందుండి పోరాడుతున్న ఆసుపత్రి సిబ్బంది ధర్నా చేసే పరిస్థితికి తీసుకొచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ పై పిచ్చివాడనే ముద్ర వేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం మరోసారి భేషజాలకు పోకుండా విశాఖపట్నం ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:'మంత్రి బొత్స సోదరుడు మా భూమిని ఆక్రమిస్తున్నాడు'

ABOUT THE AUTHOR

...view details