విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం వీరభద్రపేట పరిధిలో మిడతలు కనిపించాయి. వీరభద్రపేట, గొప్పరు గ్రామాల్లోని చెరుకు తోటల్లో 2 రోజులుగా ఇవి సంచరిస్తున్నట్లు రైతులు తెలిపారు. ఒక మొక్కపై ఎక్కువ సంఖ్యలో మిడతలు వాలుతున్నాయని.. చెరకు రేకులను తినేస్తున్నాయని చెప్పారు.
ఎడారి మిడతలేమో అని ఆందోళన చెందిన అన్నదాతలు.. వ్యవసాయ శాఖ ఏవో శ్రీనివాస్‌కు సమాచారం అందించారు. ఆయనవచ్చి పరిశీలించి అవి సాధారణంగా వరి పొలాల్లో కనిపించే మిడతలే అని.. ఆందోళన చెందవద్దని రైతన్నలకు సూచించారు.