ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆసియాలో అతిపెద్ద డీజిల్ లోకోషెడ్​గా వాల్తేర్​కు గుర్తింపు - వాల్తేర్ లోకో షెడ్ తాజా వార్తలు

వాల్తేరు డీజిల్​ లోకో షెడ్ మరో మైలు రాయిని దాటింది. తనకు నిర్దేశించిన సామర్ద్యానికి రెండింతలుగా లోకోలను నిర్వహిస్తున్న ఈ షెడ్ తాజాగా 20 ఎలక్ట్రికల్ లోకోల నిర్వహణను సమర్ధంగా పూర్తి చేసింది. దేశంలోనే లోకోల నిర్వహణ విషయంలో తొలి స్ధానంలో ఉన్న ఈ లోకో షెడ్ సమయ పాలనలో అద్వితీయంగా నిలిచింది. నడుస్తున్న ఆర్ధిక సంవత్సరంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే తమ సామర్ధ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

loco capacity
loco capacity

By

Published : Sep 11, 2020, 9:06 AM IST

ఆసియాలో అతిపెద్ద డీజిల్ లోకో షెడ్​గా వాల్తేర్ లోకో షెడ్​కి గుర్తింపు ఉంది. 150 లోకోలను మాత్రమే ఇక్కడ నిర్వహణ చేసే సామర్ధ్యం ఉన్నప్పటికి నిర్దేశించిన సమయం కంటే తక్కువ సమయంలోనే పూర్తి చేయడం గుర్తించిన రైల్వే బోర్డు ఈ షెడ్​కి 310 లోకోలను కేటాయించింది. వాటిని భారతీయ రైల్వేలలో ఎక్కడా లేని విధంగా జాతీయ సగటు కంటే ఎక్కువ ఉత్పాదక సగటు 9.48 నమోదు చేయడం ద్వారా దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. సరకు రవాణా, కోచ్ సర్వీసుల లోకోలను ఈ లోక్ షెడ్ అత్యున్నత పురోగతి నమోదు చేస్తోంది. స్ధిరంగా ఎనిమిది శాతం ఉత్పాదకత కొనసాగిస్తోంది.

లోకోషెడ్​కి ఐఎంఎస్ ధృవీకరణ, ఐఎస్​వో ధృవీకరణలు, హరిత ధృవీకరణ ఈ లోకో షెడ్ పొందింది. 203 లోకోలను రిమోట్ మోనిటరింగ్ అండ్ మేనేజ్​మెంట్ లోకోమోటివ్స్ అండ్ ట్రయిన్స్ విధానంలో నిరంతరం పర్యవేక్షిస్తుంది. దీనివల్ల లోకోలలో ఏర్పడే లోపాలను ముందుగానే సవరించి వాటి నిర్వహణ సామర్ధ్యం తగ్గకుండా చూడడంవంటివి ఇందులో ప్రత్యేకతలు. కొత్త లొకో లన్నింటికి ఈ విధానంతో అనుసంధానం చేశారు.

ఈ లోకో షెడ్​లో గతేడాది 310కి పైగా లోకోలు సర్వీసింగ్ కోసం వచ్చి పూర్తి చేసుకున్నాయి. దేశంలో ఈ లోకోకి అనుబంధంగా ఉన్న ఇంజన్లు ఇక్కడకు వచ్చి మాత్రమే సర్వీసింగ్ చేయిస్తారు. అవి ఎక్కడ ఉన్నా ఇక్కడ షెడ్​తో అనుసంధానం అయి ఉంటాయి. వాటికి సాంకేతిక సమస్యలు ఎదురైతే విశాఖ నుంచే వాటి స్ధాయిని బట్టి మరమ్మత్తులు ఏం చెయ్యాలన్నది చెబుతారు. ఈ షెడ్ పనితనాన్ని గుర్తించిన రైల్వే బోర్డు కొత్తగా 20 ఎలక్ట్రికల్ లోకోను కూడా దీనికి అనుసంధానించింది. దీనిద్వారా భవిష్యత్తులో ఎక్కువగా ఎలక్ట్రికల్ లోకోలే ఉండే అవకాశం దృష్ట్యా తన గతిని మార్చుకుని సత్తా చాటి చెబుతోంది.

ఇదీ చదవండి:మరోసారి 10 వేలకు పైనే కేసులు... 5,37,687కి చేరిన బాధితులు

ABOUT THE AUTHOR

...view details