విశాఖ మన్యంలోని పాడేరులో లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దింతో నాటుసారా విక్రయాలు జోరందుకున్నాయి. గుడివాడ, బక్కలపనుకు నుంచి నాటుసారా సరఫరా అవుతోంది. ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసినా... విక్రయాలు మాత్రం తగ్గటం లేదు. ఫలితం లేదని భావించిన పాడేరు మహిళలు ప్రధాన వీధులను ఇలా కంచెతో మూసేశారు. అపరిచిత వ్యక్తులతో పాటు, మందుబాబులను ఎవ్వరినీ ఈ వీధుల గుండా రానివ్వటం లేదు. మహిళల ప్రయత్నాన్ని పోలీసులు మెచ్చుకుంటున్నారు.
లాక్డౌన్: మందు బాబులకు ప్రత్యేకం - drinkers Lockdown in vishaka
ఊర్లోకి ఎవ్వరినీ రానివ్వకుండా, వీధుల్లో ఎవ్వరూ తిరగకుండా... లాక్డౌన్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. మహిళలు మరింత చైతన్యవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఖాళీ సమయాన్ని మందు తాగేందుకు వాడుకుంటున్నవారిని ఇలా కట్టడి చేస్తున్నారు.
మందు బాబులకు ప్రత్యేకం