విశాఖ జిల్లాలోని చోడవరం మండలం గవరవరం గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నారు. గ్రామ కార్యదర్శి పట్నాయక్ సారథ్యంలో సచివాలయ సిబ్బంది, గవరవరం పిహెచ్సీ వైద్య సిబ్బంది, వాలంటీర్లు ఇంటింటికి తిరిగి మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. లేదంటే జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు.
అందరూ లాక్డౌన్ విధిగా పాటించాలని దండోరా వేయించారు. దుకాణాలను మధ్యాహ్నం రెండు గంటల వరకు మూసివేయాలని కార్యదర్శి తెలిపారు. పక్కనే ఉన్న దేవరాపల్లి మండలంలోని పొరుగు గ్రామాల్లో కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడటంతో మండల స్థాయి అధికారుల సూచనలతో లాక్డౌన్ పాటిస్తున్నట్లు కార్యదర్శి పట్నాయక్ తెలిపారు.