లాక్ డౌన్ సమయంలో విశాఖ రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం 60 కోట్ల రూపాయల మేరకు తగ్గిందని రిజిస్ట్రార్ మన్మధరావు తెలిపారు. మే నెల మెుదటి వారం నుంచి కార్యాలయాలు పని చేయటం ప్రారంభించాక అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.
విశాఖ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంపై లాక్డౌన్ ఎఫెక్ట్ - విశాఖ రిజిస్ట్రేషన్ శాఖపై లాక్డౌన్ ప్రభావం
లాక్ డౌన్ సమయంలో దాదాపు 60 కోట్ల రూపాయల మేరకు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం తగ్గిందని విశాఖ జిల్లా రిజిస్ట్రార్ మన్మధరావు వెల్లడించారు. ఈనెల మొదటి వారం నుంచి కార్యాలయాలు పని చేయడం ఆరంభించాక .. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేస్తున్నామన్నారు. ఇ-డాక్యుమెంట్లపై అవగాహన పెంచుకుంటే మరింత సులువుగా పని పూర్తవుతుందని ఈటీవీ భారత్ ముఖాముఖిలో వెల్లడించారు.
విశాఖ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంపై లాక్డౌన్ ఎఫెక్ట్