విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతంలో టమాటా అధికంగా సాగుచేశారు. పంట చేతికి వచ్చిన సమయంలో కరోనా మహమ్మారి రైతులను దెబ్బతీసింది. కనీసం పెట్టుబడి పెట్టిన డబ్బు రాని పరిస్థితి ఏర్పడింది. కూరగాయల కొనుగోలుపై ప్రజలు ఆసక్తి చూపుతున్నా... అమ్ముకోవడానికి అవకాశం లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు దృష్టి సారించి అమ్ముకునే అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు.
టమాటా రైతులకు లాక్డౌన్ దెబ్బ
పంట దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చినా... అమ్ముకునే వీలు లేక రైతులు నష్టపోతున్నారు. కూరగాయల మార్కెట్లు దగ్గరున్నా లాక్డౌన్ కారణంగా విక్రయించలేని పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి తమ పంట అమ్ముకునే వీలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
టమాటా రైతులకు లాక్డౌన్ దెబ్బ