విశాఖ జిల్లా అరకులోయలో స్వచ్ఛంద లాక్ డౌన్ కొనసాగుతోంది. అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ పిలుపుమేరకు లాక్డౌన్ అమలవుతోంది. వర్తక వాణిజ్య దుకాణాలన్నీ మూతపడ్డాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు శుక్రవారమైనా సంతకు రాలేదు . వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా వ్యాప్తిని కట్టడికై అరకులోయలో ఒక రోజు లాక్డౌన్ అమలు చేయాలని ఎమ్మెల్యే నిర్ణయించారు. వారపు సంత జరిగే శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల రాకపోకలను ఆపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అరకులోయలో ఒకరోజు స్వచ్ఛందగా లాక్డౌన్ అమలు
విశాఖ జిల్లా అరకులోయలో స్వచ్ఛంద లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా అరకులోయలో ఒక రోజు లాక్డౌన్ అమలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే నిర్ణయించారు.
అరకులోయలో ఒకరోజు స్వచ్ఛందగా లాక్డౌన్ అమలు