ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్ నిబంధనలు పాటించిన గోవు..! - lock down in vishaka news

కరోనా లాక్ డౌన్ నిబంధనలు మనుషులకే కాదు.. తనకు వర్తిస్తుంది అనుకుంది ఓ ఆవు. రోజు తనకు ఆహారం పెట్టే షాపు వద్ద జనం ఎక్కువగా ఉండటంతో.. ఆవు చాలాసేపు క్యూలైన్లోనే నిలబడింది.

lock down
lock down

By

Published : Jun 6, 2020, 2:13 PM IST

విశాఖ మన్యం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారిలో ఉన్న ఓ మందుల దుకాణం వద్ద ప్రతిరోజు గోవులు వచ్చినప్పుడు బ్రెడ్ పెడుతుంటారు. దుకాణం వద్ద రద్దీగా ఉన్న సమయంలో కస్టమర్లు లాక్​డౌన్ నిబంధనలతో భౌతికదూరం పాటిస్తూ ఉన్నారు. ఆహారం కోసం వచ్చిన ఓ ఆవు తనకూ నిబంధన వర్తిస్తుంది అనుకుందో ఏమో.. క్యూలైన్లో నిలబడింది. కస్టమర్లు వెళ్లిపోయాక ఆవుకు ఆహారం పెట్టాడు దుకాణాదారుడు. అప్పటివరకు ఎవరినీ ఏమీ అనకుండా చాలా సేపు క్యూలోనే నిలబడింది ఈ ఆవు.

ABOUT THE AUTHOR

...view details