విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో లాక్డౌన్ అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఆదివారం జనతా కర్ఫ్యూతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. సోమవారం యథావిధిగా రోడ్లపైకి వచ్చారు. దుకాణాలు, హోటళ్లు తెరచుకున్నాయి. ఆటోడ్రైవర్లు ఆటోలు నడిపారు. జాతీయ రహదారిపై వాహనాలు తిరిగాయి. విషయం తెలుసుకున్న పాయకరావుపేట పోలీసులు.. షాపులు మూసేయాలని నిర్వాహకులకు ఆదేశించారు.
పాయకరావుపేటలో.. రోడ్లపై యథేచ్ఛగా ప్రజల సంచారం - lock down failed in payakarao peta
విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో లాక్డౌన్ ను ప్రజలు బేఖాతరు చేశారు. దుకాణాలు, హోటళ్లు తెరుచుకున్నాయి. రహదారిపై యథావిధిగా వాహనాలు తిరిగాయి.
పాయకరావుపేటలో విఫలమైన లాక్డౌన్