ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరి విద్యార్థులపై కరోనా ఎఫెక్ట్..! - tribal students latest news in visakhapatnam district

వార్షిక పరీక్షలపై కరోనా ప్రభావం చూపటంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి వద్దనే ఉంటూ ఆన్‌లైన్‌ చదువులపై దృష్టిపెట్టారు. కానీ గిరిజన విద్యార్థులు మాత్రం వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు. పరీక్షలు పూర్తి చేసి మార్కులు కోసం ఎదురుచూడాల్సిన గిరి విద్యార్థులు... మట్టి తొక్కి పూరిళ్లు కట్టుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. కరోనా వల్ల పదిపరీక్షలు వాయిదా పడటంతో విశాఖ మన్యంలోని విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

గిరి విద్యార్థులపై కరోనా ఎఫెక్ట్
గిరి విద్యార్థులపై కరోనా ఎఫెక్ట్

By

Published : May 1, 2020, 6:51 PM IST

గిరి విద్యార్థులపై కరోనా ఎఫెక్ట్

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో 116 వివిధ గిరిజన సంక్షేమ పాఠశాలు ఉన్నాయి. వాటిలో 50 వేలమంది పైగా గిరి విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరిలో 6వేల మంది వరకు పదో తరగతి వారే ఉన్నారు. అయితే లాక్​డౌన్​తో విద్యా సంవత్సరం ముగిసే సమయంలో విద్యార్థులు గూడాలకు పరిమితమయ్యారు. ఇళ్లకు వెళ్లిన తర్వాత వారి విద్యా విషయాలు మరిచిపోయి ఇంటి పనుల్లో తీరిక లేకుండా పనిచేసుకుంటున్నారు.

ఏ గ్రామంలో చూసినా విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఎదో పనిలో ఉండిపోయారు. కొందరు గుడిసెలు నిర్మాణానికి మట్టి తొక్కుతున్నారు. మరికొందరు మొక్కలు నాటడం, పశువులు కాసే పనుల్లో ఇలా తలో చెట్టూ పుట్టా అన్నట్లు కనిపిస్తున్నారు. ప్రభుత్వం దూరదర్శన్, రేడియోల్లో పదో తరగతి పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఏజెన్సీ మారుమూల చాలా మందికి టీవీలు లేక పోవడంవల్ల పాఠాలకు కొందరు విద్యార్థులు దూరమయ్యారు. ఆశ్రమాల్లో గుడ్లు, మాంసం, పాలుతో కూడిన పౌష్టికాహారం పెట్టేవారు. ప్రస్తుతం చాలా మంది గంజి, అంబలితో కడుపు నింపుకుంటున్నారు.

ఇదీ చూడండి:విద్యార్థులకు ఆకాశవాణి ద్వారా ఆడియో పాఠాలు

ABOUT THE AUTHOR

...view details