కరోనా కారణంగా యావత్ ప్రపంచం కష్టాల్లో పడింది. అన్ని రంగాలు కుంటుపడ్డాయి. విద్యా రంగం పెద్ద ముప్పు ఎదుర్కొంటోంది. సాహిత్య, సాంస్కృతిక రంగాలు, లలిత కళలు, సంగీతం, నృత్యంలో శిక్షణ ఇచ్చే సంస్థలు దాదాపు మూతపడ్డాయి. శిక్షకులు జీవనోపాధి పోగొట్టుకుని ఇబ్బంది పడుతున్నారు. క్రీడా శిక్షకుల పరిస్థితి ఇదే రీతిలో ఉంది.
ఈ రెండు నెలలు ఆదాయ వనరులు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మిగతా రంగాలను ఆదుకున్నట్టే సాంస్కృతిక, క్రీడా రంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.