ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాకిస్థాన్​ చెర నుంచి ప్రశాంత్​ను విడిపించాలి' - latest news on telugu man at pakishan

విశాఖకు చెందిన ప్రశాంత్​ను పాకిస్థాన్​ చెర నుంచి విడిపించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకోవాలని కోరుతున్నారు.

ప్రశాంత్​పై స్థానికులు

By

Published : Nov 19, 2019, 3:14 PM IST

ప్రశాంత్​పై స్థానికులు
విశాఖకు చెందిన ప్రశాంత్ అనే సాఫ్ట్​వేర్ ఉద్యోగిని పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్త స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ప్రశాంత్ కుటుంబం విశాఖ నగరం మధురవాడ ప్రాంతంలోని మిథిలాపురి వుడా కాలనీలో నివాసం ఉంటోంది. ప్రశాంత్ తండ్రి బాబురావు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా... తల్లి ఇందిర గృహిణి. ప్రశాంత్ కుటుంబం అందరితో కలిసిపోయి ఎంతో ఆత్మీయంగా ఉంటుందని, ప్రశాంత్, అతని అన్న శ్రీకాంత్‌ ఇద్దరూ చాలా మంచివాళ్లని స్థానికులు అంటున్నారు. ప్రశాంత్ పాకిస్థాన్ సరిహద్దులో ఎందుకు అరెస్టయ్యారో తెలియదని ఆవేదన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ప్రశాంత్‌ను పాకిస్థాన్ చెర నుంచి విడిపించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details