విశాఖ చోడవరంలో 144వ సెక్షన్ అమలును స్నేహపూర్వకంగా పోలీసులు నిర్వహిస్తున్నారు. రోడ్లపైకి వస్తే.. వారికి కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. తర్కించే వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారు. ద్విచక్రవాహనంపై ఒకరు మాత్రమే పయనించే విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎండలో ఉంటూ రహైదారులపై పహారా చేస్తున్న పోలీసులకు స్థానికులు సంఘీభావం తెలుపుతున్నారు. సిబ్బందికి వాటర్ బాటిల్స్, బిస్కెట్లు, కూల్ డ్రింక్‌లు అందజేస్తున్నారు.
పోలీసులకు సంఘీభావం.. దాహార్తి తీరుస్తున్న జనం - లాక్డౌన్లో ఉన్న పోలీసులకు సహాయం చేస్తున్న విశాఖ స్థానికులు
లాక్డౌన్ అమలులో ఉంది.. బయటకు రావద్దంటూ పోలీసులు పహరా కాస్తూనే ఉన్నారు. ఎండను సైతం లెక్క చేయటం లేదు. వారి కష్టాలను చూసిన కొందరు ప్రజలు వారి దాహార్తి తీరుస్తున్నారు.
Locals helping police in lockdown at chodavaram in visakha district