విశాఖ జిల్లా కోతకోటకు చెందిన సాహితీ.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నతనం నుంచే ఈతలో పట్టు సాధించి.. ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ఒకరోజు తల్లిదండ్రులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సాహితీ... సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు చిన్నారులను కాపాడి మానవత్వాన్ని చాటుకుంది. ఆ విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం....ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి జాతీయ బీమా రక్ష పురస్కారానికి ఎంపిక చేసింది. సాహితీ లాంటి విద్యార్థి తమ కళాశాలలో చదవడం ఎంతో గర్వంగా ఉందని...ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంత సాధించగలగానని....భవిష్యత్తులో ఐఐటీలో చేరి క్రీడాకారిణిగా ఎదగాలని ఆశ పడుతోంది సాహితీ.
కేంద్ర జీవన బీమా రక్ష పురస్కారానికి ఎంపికైన సాహితీ - Visakhapatnam District Latest News
తల్లి నేర్పిన పాఠాలతో క్రీడాకారిణిగా రాణించటమే కాకుండా.....ఆపదలో ఉన్న పిల్లలను కాపాడి మానవత్వం చాటుకున్న ఆ అమ్మాయికి.....కేంద్ర పురస్కారం వరించింది.
కేంద్ర జీవన భీమా రక్ష పురస్కారానికి ఎంపికైన సాహితీ