విశాఖ జిల్లా పాయకరావుపేటలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో.. పి. ఎల్ పురానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సుమారు 200 మద్యం సీసాలు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. పాయకరావుపేట వద్ద దాడులు చేపట్టారు. మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్రమంగా తరలిస్తున్న 200 మద్యం సీసాలు పట్టివేత - viskha district crime news
అనుమతి లేకుండా తరలిస్తున్న మద్యాన్ని పాయకరావుపేట వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
![అక్రమంగా తరలిస్తున్న 200 మద్యం సీసాలు పట్టివేత liquor seized at Payakaraopeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10562509-228-10562509-1612884066228.jpg)
అక్రమంగా తరలిస్తున్న 200 సీసాల మద్యం పట్టివేత