విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెం చెందిన రమేష్ అనే వ్యక్తి అధిక ధరలకు మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆతడి నుంచి 14 మద్యం సీసాలు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఉపేంద్ర తెలిపారు. మద్యం గొలుసు దుకాణాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ముందుగా బైండోవర్ చేసినట్లు వివరించారు. గొలుసు దుకాణాలు నిర్వహిస్తే పీడీ యాక్ట్ అమలు చేస్తామని సీఐ హెచ్చరించారు.
మద్యం గొలుసు అమ్మకాలు.. పోలీసులు చెక్ - liquor shope latest news
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి అధిక ధరలకు అమ్ముతున్న వ్యక్తిపై అనకాపల్లి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మద్యం గొలుసు దుకాణాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పీడీ యాక్ట్ అమలు చేస్తామని సీఐ ఉపేంద్ర తెలిపారు.
మద్యం అక్రమ రవాణా చేసిన వ్యక్తి అరెస్ట్