విశాఖ ఏజెన్సీలో రూ.50 లక్షల విలువైన లిక్విడ్ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ కొత్తూరు బయలు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తి ద్విచక్రవాహనాన్ని రోడ్డుపై వదిలేసి పారిపోయాడు. ద్విచక్రవాహనాన్ని పరిశీలించిన పోలీసులు.. 18 కేజీల లిక్విడ్ గంజాయి ప్యాకెట్లును గుర్తించారు. ఈ ప్యాకెట్ల స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆ లిక్విడ్ గంజాయి విలువ 50 లక్షల రూపాయలకుపైగా ఉంటుందని అంచనా వేశారు.
Ganja: రూ. 50 లక్షల విలువైన.. లిక్విడ్ గంజాయి పట్టివేత! - విశాఖ మన్యంలో ద్రవరూప గంజాయి పట్టివేత
రూ.50 లక్షల విలువైన ద్రవరూప గంజాయిని విశాఖ ఏజెన్సీలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింతపల్లి మండలం కొత్తూరు బయలు వద్ద చేపట్టిన తనిఖీల్లో.. లిక్విడ్ గంజాయి పట్టుబడింది.
ద్రవరూప గంజాయి పట్టివేత