విశాఖపట్నం అనకాపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. చాలా రోజుల తర్వాత మద్యం అమ్మకాలు మొదలైనందున మందుబాబులు బారులు తీరారు.
దుకాణం వద్ద ఐదుగురే ఉండాలన్న నిబంధన పక్కన పెట్టి గుమిగూడారు. మందుబాబులు అధిక సంఖ్యలో వచ్చిన కారణంగా.. వారిని ఆపడానికి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొన్నిచోట్ల కాసేపు అమ్మకాలు ఆపి పరిస్థితి చక్కదిద్దిన తర్వాత.. తిరిగి ప్రారంభించారు.