విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో వలసగెడ్డ, పాలగెడ్డ, ఇంతులూరి వాగులు పొంగి పొర్లుతున్నాయి. విశాఖ జిల్లాలోని డొంకరాయి జలాశయం ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1037 అడుగులు కాగా... ప్రస్తుతం 1036.5 అడుగుల నీటిమట్టం నమోదైంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నాలుగు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సీలేరు, జోలాపుట్, బలిమెల జలాశయాలకూ భారీగా వరద వస్తోంది.