విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్ బాధిత గ్రామాలు వెంకటాపురం, నందమూరి నగర్ వాసుల నిరసనకు దిగారు. ఇళ్లలోనే ఉండి ప్లకార్డులతో ఆందోళన చేస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
వైద్య పరీక్షలు నిర్వహించాలని బాధిత గ్రామస్థుల నిరసన - lg polymers news updates
విశాఖలో విషవాయువు ఘటన తర్వాత అక్కడి గ్రామస్థులు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయపడుతున్నారు. గ్యాస్ లీక్‌లో అస్వస్థతకు గురై చికిత్స అనంతరం ఇంటికొచ్చిన తర్వాత మళ్లీ జబ్బు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
lg polymers