విశాఖ ఎల్జీ పాలీమర్స్ పరిసర గ్రామాలు ఇంకా కుదుట పడలేదు. రసాయన వాసన ఇంటి నలుమూలల వ్యాపించిన కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చేసేది లేక ఇంటిని శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
నిన్నటి వరకు బాధితులకు భోజన సదుపాయం కల్పించిన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం.. ఆ సదుపాయాన్ని నిలుపుదల చేసింది. ఈక్రమంలో బాధిత గ్రామాలయిన వెంకటాపురం, వెంకటాద్రి నగర్లోని ప్రజల జీవన అవస్థలను మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు.