ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆవిరి లీక్​తోనే ప్రమాదం.. బాధితులకు అండగా ఉంటాం: ఎల్జీ పాలిమర్స్

విశాఖ ప్లాంట్​లో ఆవిరి లీక్ అవ్వడమే ప్రమాదానికి కారణమని ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రకటించింది. విశాఖపట్నం ప్లాంట్​లో స్టైరీన్ పాలిమర్ గ్యాస్ లీకేజీ అయిన స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఆవిరి కారుతున్నట్లు సంస్థ తెలిపింది.

LG Polymers says vapour leak caused accident at Vizag plant
ఎల్జీ పాలిమర్స్ ఇండియా లిమిటెడ్

By

Published : May 9, 2020, 8:11 PM IST

శనివారం ఉదయం విశాఖ ప్లాంట్‌లో స్థితిగతులను పునరుద్ధరించినట్లు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. లాక్​డౌన్​ పాక్షికంగా సడలించిన అనంతరం సంస్థ కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి ప్రయత్నించిన తర్వాత ప్లాంట్ నుంచి గ్యాస్ లీకై ప్రమాదం జరిగిందని పేర్కొంది. స్టైరీన్ మోనోమర్ (ఎస్ఎమ్) స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఆవిరి లీక్ అవ్వడమే ఈ సంఘటనకు కారణమని తమ ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నట్లు సంస్థ ప్రకటనలో స్పష్టం చేసింది.

ఎల్​జీ యాజమాన్యం ప్రకటనలో సారాంశం

  • భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి సంబంధిత అధికారులతో కలిసి పనిచేయడానికి తమ యాజమాన్యం కట్టుబడి ఉంది.
  • తమ బృందాలు ప్రభుత్వంతో కలిసి పగలు, రాత్రి పని చేస్తున్నాయి. ఈ దుర్ఘటన వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి, వెంటనే అమలు చేయగల సమర్థవంతమైన సంరక్షణ ప్యాకేజీని అందించేలా చర్యలను రూపొందించడానికి మేం కృషిచేస్తున్నాం.
  • బాధితులు, వారి కుటుంబాల సమస్యలు పరిష్కరించడానికి, వారికి సహాయం అందించడానికి ప్రత్యేక టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేశాం.
  • అన్ని కుటుంబాలను త్వరలో సంప్రదించి.. మృతుల కుటుంబాలకు, బాధితుల వైద్య ఖర్చులకు సహాయం అందించాల్సిన బాధ్యత తమపై ఉంది.
  • స్థానిక కమ్యూనిటీలకు దోహదపడే దీర్ఘకాలిక సహాయ కార్యక్రమాలను మేము చురుకుగా అభివృద్ధి చేస్తాం.
  • ఈ సంఘటనతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ ఎల్జీ పాలిమర్స్ ఇండియా సంస్థ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం.
  • బాధితులను రక్షించడానికి, వారు కోలుకోవడానికి కష్టపడి పనిచేసిన అధికారులు, పోలీసులు, ప్రతి సభ్యునికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.. అని సంస్థ ప్రకటనలో పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details