ఎన్జీటీ ఆదేశాల మేరకు ఎల్జీ పాలిమర్స్ సంస్థ 50 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసింది. స్టైరీన్ లీకేజ్ దుర్ఘటనలో 12 మంది మృతి చెందగా.. వందల మంది అస్వస్థతకు గురయ్యారు. పలువురు ఇప్పటికీ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. గ్యాస్ లీకేజ్‌పై పరిణామాలను, జీవ, జంతు జాలానికి జరిగిన నష్టాన్ని.. దీర్ఘకాలిక సమస్యలపైనా.. ఎన్జీటీ పరిశీలించి ఏ రకమైన చర్యలు చేపట్టాలన్నది నిర్ణయించనుంది. ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఇచ్చిన నిధులను బాధిత గ్రామాల కోసం వెచ్చించనున్నారు.
రూ.50 కోట్లు డిపాజిట్ చేసిన ఎల్జీ పాలిమర్స్ - విశాఖ గ్యాస్ లీకేజ్ న్యూస్
విశాఖ ఎల్జీ పాలిమర్స్ స్టైరీన్ లీకేజ్ ప్రమాద ఘటనకు సంబంధించి ఎన్జీటీ(జాతీయ హరిత ట్రైబ్యునల్) ఆదేశాల మేరకు ఆ సంస్థ 50 కోట్ల రూపాయలను ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసింది. ఈ మేరకు చెక్‌ను విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌కు అందించింది.
lg polymers 50 crores deposit to vishaka collector vinaychand