ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో చిత్రకొండ ప్రాంతంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గుర్తుతెలియని వ్యక్తులు గోడపత్రికలు అంటించారు. చిత్రకొండ స్పిల్ వే, బోండా ఘటి , మడకపొడర్ తదితర మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఈ గోడపత్రికలు కనిపించాయి. కరోనా నేపథ్యంలో ఏవోబీలో మావోయిస్టులు సమావేశాలు ఏర్పాటు చేయటం తగదని పత్రికల్లో పేర్కొన్నారు. అమాయక గిరిజనులను హింసించటం సరికాదని తెలిపారు. ఆదివాసీ అభివృద్ధి కమిటీ కట్ ఆఫ్ ఏరియా పేరిట ఈ పత్రికలు వెలిసినట్లు పోలీసులు తెలిపారు.
మావోలకు వ్యతిరేకంగా ఏవోబీలో గోడపత్రికలు - latest news of mavos in visakha
ఆంధ్ర ఒడిశా సరిహద్దులో మావోలకు వ్యతిరేకంగా గోడపత్రికలను వెలిశాయి. ఆదివాసీ అభివృద్ధి కమిటీ కట్ ఆఫ్ ఏరియా పేరిట ఈ పత్రికలు గోడలపై కనిపించినట్టు పోలీసులు తెలిపారు.
![మావోలకు వ్యతిరేకంగా ఏవోబీలో గోడపత్రికలు letters against mavos in visakha dst AOB](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7891676-853-7891676-1593865596626.jpg)
letters against mavos in visakha dst AOB