విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు త్వరలోనే అన్నప్రసాద వితరణ ప్రారంభించాలని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు అధికారులను ఆదేశించారు. దేవస్థాన అధికారులకు పలు సూచనలు చేస్తూ ఆయన లేఖ పంపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఆహార పొట్లాలను అందించాలని సూచించారు. దేవస్థానంలో భూముల లీజులు, లైసెన్సులు, అభివృద్ధి పనులు, మేజర్ కొనుగోళ్లు, టెండర్లపై తన దృష్టికి తీసుకురాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఈవోను ఆదేశించారు. ఇదే లేఖను దేవదాయశాఖ కమిషనర్‌కు కూడా అశోక్ గజపతిరాజు పంపించారు.
"అప్పన్న సన్నిధిలో అన్నప్రసాద వితరణ ప్రారంభించాలి" - latest news in vishaka district
సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభించాలని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఆదేశించారు. దేవస్థానానికి సంబంధించిన విషయాలను తన దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ అధికారులకు లేఖ రాశారు.

పూసపాటి అశోక్ గజపతిరాజు