ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైవాడ జలాశయంలో అడుగంటిన నీరు.. ఆందోళనలో రైతులు

By

Published : May 7, 2021, 6:29 PM IST

విశాఖలోని రైవాడ జలాశయంలో నీటినిల్వలు అడుగంటాయి. జలాశయం ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రాజెక్టులో నీరు తగ్గిపోయిన కారణంగా.. మట్టిదిబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

raiwada reservoir
raiwada reservoir

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయంలో.. నీటి నిల్వలు అడుగంటాయి. జలాశయం ప్రధాన స్పిల్ వే గేట్ల వద్ద చుక్క నీరు లేదు. ప్రాజెక్టులో నీరు తగ్గిపోయిన కారణంగా.. మట్టిదిబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

జలాశయం ఆయకట్టు రైతులు సాగునీటిపై ఆందోళన చెందుతున్నారు. పూర్తి నీటిమట్టం 114 మీటర్లు కాగా.. ప్రస్తుతం 105 మీటర్లు మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 109 మీటర్లు ఉండేదని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details