ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బడ్జెట్: సాగునీటి ప్రాజెక్టులకు అరకొరగా నిధులు - విశాఖలో సాగునీటి ప్రాజెక్టులు సమస్యలు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో వ్యవసాయానికి ప్రధాన ఆధారమైన సాగునీటి ప్రాజెక్టులకు అరకొరగానే నిధుల కేటాయింపులు చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ ఈ బడ్జెట్​తో కష్టమవుతుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేయగా.. ఆయకట్టు రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

visakha
విశాఖలో సాగునీటి ప్రాజెక్టులు సమస్యలు

By

Published : May 21, 2021, 11:36 AM IST

ప్రతి సంవత్సరం ప్రవేశపెడుతున్న బడ్జెట్​లో విశాఖలోని ప్రధాన ప్రాజెక్టులకు మొండిచేయే ఎదురవుతోంది. మాడుగుల మండలంలోని పెద్దేరు, చీడికాడ మండలంలో కోనాం, దేవరాపల్లి మండలంలోని రైవాడ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి ఆయకట్టు పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. జలాశయాలతో పాటు ఆయకట్టు ప్రాంతాల్లో అనేక సమస్యలు సమస్యలున్నాయి. పలు అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. ప్రతి సంవత్సరం ప్రవేశపెడుతున్న బడ్జెట్​లో నిధులే కేటాయించట్లేదు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో పెద్దేరు జలాశయానికి రూ.10.5 లక్షలు, కోనాం జలాశయానికి రూ.10 లక్షలు, రైవాడ జలాశయానికి చాలా తక్కువగా రూ.2 లక్షలు మాత్రమే కేటాయింపులు చేశారు. దీంతో ప్రాజెక్టుల నిర్వహణపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై పలువురు ఆయకట్టు రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details