ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు బిల్లుకు వ్యతిరేకంగా వామపక్ష నేతల ఆందోళన - left party leaders on farmer bills news

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన.. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష నేతలు నిరసనకు దిగారు. ఈ వ్యవసాయ బిల్లుల వలన రైతులపై మరింత భారం పడుతుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

left party leaders agitation
రైతు బిల్లలకు వ్యతిరేకంగా ఆందోళనలు

By

Published : Sep 30, 2020, 3:07 PM IST

Updated : Sep 30, 2020, 7:30 PM IST

విశాఖ జిల్లాలో..

రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. విశాఖలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ చట్టాలు రైతాంగాన్ని కుదేలు చేసేవిగా ఉన్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కార్పరేట్ కంపెనీలకు లాభం చేకూర్చటం కోసం చట్టాలు చేస్తే.. చూస్తూ ఊరుకోబోమని నేతలు హెచ్చరించారు.

తూర్పు గోదావరి జిల్లాలో..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటు సమావేశంలో రైతులకు సంబంధించి తీసుకువచ్చిన మూడు బిల్లులను నిరసిస్తూ.. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో వామపక్షాలు మూడు రోజుల పాటు నిరసన దీక్షకు దిగారు. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలకు ఈ బిల్లులు పూర్తిగా హరిస్తాయనీ.. రైతులు కార్పొరేట్ సంస్థల చేతిలో కీలుబొమ్మలుగా మారుతారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ బిల్లలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ, సీపీఎం, ఇతర రాజకీయ నాయకులు దీక్షలో పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ వామపక్షాలు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిరసన చేపట్టారు. సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో కాకినాడలోని సుందరయ్య భవనం వద్ద మూడు రోజుల దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులు రైతులకు నష్టం కలిగించి.. కార్పొరేటర్లుకు మేలు చేసేలా ఉన్నాయని వామపక్షాల నేతలు ఆరోపించారు. తక్షణమే బిల్లులను ఉపసంహరంచుకోవాలని, లేదంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు బిల్లులకు నిరసనగా.. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర చట్టాన్ని సవరించి.. కోట్లాదిమంది భారతీయులకు ఆహార భద్రత లేకుండా చేశారని ఆరోపించారు. ఈ చట్టం అమలైతే, ఆహార రంగంలో స్వాలంబన కోల్పోతామని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు ఆర్ లింగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టం వలన రైతులు తమ పొలాల్లోనే.. కూలీలుగా మారే ప్రమాదం ఉందన్నారు.

అనంతపురం జిల్లాలో..

అనంతపురం జిల్లా పెనుకొండలో జీవో నెంబర్ 22ను తక్షణమే రద్దు చేయాలని.. వామపక్షాలు నిరసనకు దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల కపట ప్రేమను చూపిస్తూ.. నట్టేట ముంచుతున్నాయని ఆరోపించారు. 22వ జీవోపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరి మార్చుకోకపోతే, జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని నేతలు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఖరీఫ్ కొనుగోళ్లుకు సిద్దంకండి: జేసీ

Last Updated : Sep 30, 2020, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details