ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీ గో బ్యాక్ అంటూ వామపక్ష పార్టీలు ఆందోళన.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. - protest against Modi visit to Visakhapatnam

Left parties against: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తూ విశాఖలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానం వేదికకు దూరంలో.. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మోదీ రాకడను వ్యతిరేకిస్తూ సభాస్థలి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. తెలుగు రాష్ట్రాలకు మోదీ మొండి చేయి చూపిస్తున్నారని వామపక్షాలు మండిపడ్డాయి.

వామపక్ష పార్టీలు
Left parties againsts

By

Published : Nov 12, 2022, 3:58 PM IST

ప్రధాని మోదీ విశాఖ పర్యాటనను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ఆందోళన

Prime Minister Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తూ విశాఖలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానం వేదికకు దూరంలో మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మద్దిలపాలెంలోని సాయిరాం పార్లర్ ప్రాంతం నుంచి నినాదాలు చేస్తూ వస్తున్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్​కు తరలించారు. ఉత్తరాది రాష్ట్రాలకు అభివృద్ధి ఫలాలు అందిస్తూ... దక్షిణాది రాష్ట్రాలకు మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు మోదీ మొండి చేయి చూపిస్తున్నారని నిరసన కారులు ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలను చిన్నచూపు చూస్తున్న ప్రధానమంత్రి మోదీకి విశాఖలో పర్యటించే నైతిక హక్కు లేదని విమర్శించారు. ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ సభాస్థలి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.

ABOUT THE AUTHOR

...view details