ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వం ఇలా చేయడం దారుణం' - విశాఖలో సీపీఐ సీపీఎం నాయకుల ఆందోళన

కరోనా లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమై.. జీవనానికే అవస్థలు పడుతున్న పేద ప్రజలపై.. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారం మోపడం దారుణమని వామపక్ష నాయకులు అన్నారు. పెరిగిన కరెంట్ బిల్లులకు వ్యతిరేకంగా విశాఖలో నిరసన తెలియజేశారు.

left parites protest against high electricity bills in vizag
విశాఖలో వామపక్షాల ధర్నా

By

Published : May 18, 2020, 2:25 PM IST

సాంకేతిక కారణాలను సాకుగా చూపి విద్యుత్ బిల్లుల మోత మోగిస్తున్నారంటూ.. ప్రభుత్వ వైఖరిపై వామపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. విశాఖ సీపీఎం కార్యాలయంలో ఆందోళనకు దిగాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో పేద, దిగువ మధ్య తరగతి వర్గాలు ఏ, బీ కేటగిరీల్లో ఉండేవని చెప్పారు. 90 శాతం మంది పేద, బడుగు వర్గాల బిల్లులు.. సీ కేటగిరిలోకి తెచ్చే విధంగా విద్యుత్ శాఖ వ్యవహరిస్తోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్. నర్సింగరావు ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం రానున్న కాలంలో రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండళ్లను రద్దు చేసి.. కేంద్రీకృత విద్యుత్ వ్యవస్థను తెచ్చేందుకు, డిస్కంలను ప్రైవేటీకరించేందుకు యత్నిస్తోందని అన్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇళ్లకే పరిమితమైన ప్రజలపై బిల్లుల భారం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇవీ చదవండి.. వలస కూలీలకు చెప్పులు, రొట్టెల పంపిణీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details