Leaders of special status sadhana samiti: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వకుండా భాజపా తీరని అన్యాయం చేస్తోందని.. ప్రత్యేకహోదా సాధన సమితి నాయకులు విమర్శించారు. విభజన హామీలు అమలు చేయకుండా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రజలను.. మోదీ ప్రభుత్వం నట్టెట ముంచిందన్నారు. విభజన అనంతరం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఈనెల 26న చలో దిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సాధన సమితి నాయకులు ప్రకటించారు. ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా వామపక్షాలు, కార్మిక సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం, మహిళలనీ చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు. మోదీకి రాష్ట్రంలోని వైకాపా, తెలుగుదేశం, జనసేన పార్టీలు వత్తాసు పలకడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టడమేంటని ప్రశ్నించారు.