ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

18 పీహెచ్​సీల్లో నూతన వైద్య పరికరాలు

విశాఖ మన్యంలోని పీహెచ్​సీలకు అందించిన వైద్య పరికరాలను పాడేరు ఎమ్మెల్యే, ఐటీడీఏ అధికారి ప్రారంభించారు. చికిత్స అవసరమైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

launching medical equipments in  manyam vizag district
వైద్య పరికరాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

By

Published : Aug 26, 2020, 5:22 PM IST

విశాఖపట్నం జిల్లాలోని మన్యంలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అందించిన వైద్య పరికరాలను.. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ''ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్'' వారి సహాయంతో ఈ పరికరాలు అందజేశారు.

కొవిడ్ వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. పీహెచ్​సీలకు అవసరమైన ఆరోగ్య సామగ్రి అందించిన ఆర్గనైజేషన్​కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కోరారు.

ABOUT THE AUTHOR

...view details