విశాఖ జిల్లా అనకాపల్లిలో రాష్ట్ర మద్య విమోచన ప్రచారాన్ని అదనపు జిల్లా న్యాయమూర్తి చక్రపాణి, ఆర్డీఓ సీతారామారావు ప్రారంభించారు. మద్యం వద్దు.. కుటుంబం ముద్దు అనే నినాదంతో మద్యానికి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. దీంట్లో భాగంగా పోస్టర్లను వీరు ఆవిష్కరించారు.
మద్యం వద్దు.. కుటుంబం ముద్దు నినాదంతో మద్య విమోచన ప్రచారం - విశాఖ జిల్లా వార్తలు
మద్యం వద్దు.. కుటుంబం ముద్దు అనే నినాదంతో రాష్ట్ర మద్య విమోచన ప్రచారాన్ని విశాఖ జిల్లాలో అదనపు జిల్లా న్యాయమూర్తి, ఆర్డీఓ ప్రారంభించారు
జిల్లాలో మద్యం విమోచన ప్రచారం ప్రారంభం
మద్యం మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిని తిరిగి సమాజ జీవనంలోకి తీసుకొచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచారం చేపడుతుందని వివరించారు. మద్యం రహితసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మద్య విమోచన ప్రచార కర్త సురేష్బిబేతా పాల్గొన్నారు.
ఇదీ చదవండి విశాఖ మన్యంలో విరిగిపడిన కొండ చరియలు