ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాచలంలో చందనం అరగదీత ప్రారంభం - సింహాచలంలో చందనం అరగదీత కార్యక్రమం

సింహాచలంలో చందనం అరగదీత కార్యక్రమం.. ఆలయ అర్చకుల నడుమ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

Launch of Sandalwood Maceration program in Simhachalam temple
Launch of Sandalwood Maceration program in Simhachalam temple

By

Published : Apr 18, 2020, 4:13 PM IST

విశాఖ సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో చందనం అరగదీత కార్యక్రమం శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి పాదాల చెంత గంధపు చెక్కను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. 5 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి.. 125 కేజీల చందనాన్ని సిద్దం చేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఈ నెల 26వ తేదిన జరిగే ఉత్సవం అనంతరం ఆ చందనాన్ని స్వామివారికి సమర్పించనున్నారు. ఆంక్షల కారణంగా.. కేవలం 15 మందితో అంతరంగికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. భక్తులకు దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details