విశాఖ మన్యంలోని గిరి రైతులు పంటలు నూర్పుల విషయంలో పలు పద్ధతులను అవలంబిస్తున్నారు. గతంలో జోడెడ్ల ద్వారా పండించిన పంటకు కళ్లంలో వేసి పంటను నూర్చేవారు. అనంతరం వాటిని ఎగర వేస్తూ శుభ్రం చేసేవారు. అయితే మారుతున్న కాలానికి పెరుగుతున్న సాంకేతికతను గిరి రైతులు అంది పుచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగా పండించిన పంటలకు నూర్పులను చేయడంలో విభిన్న పద్ధతులను ఉపయోగిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం గొందిపొలం రైతులు ఆటోతో వరి నూర్పులు చేయడం అందర్ని ఆకట్టకుంటుంది. రైతు బాడుగకు ఆటో తీసుకుని కళ్లాంలో నూర్పలు చేశారు. ఈ పద్ధతిలో నూర్పులు చేయడం వల్ల కుటుంబ సభ్యులతో నూర్పులు చేసుకోవచ్చునని, ఈ పద్ధతి ఎంతో సులువుగా ఉంటుందని రైతు గోపీనాథ్ తెలిపాడు.
షేర్ ఆటోతో పంట నూర్చటం చూశారా..! - షేర్ ఆటోతో పంట నూర్పు న్యూస్
విశాఖ మన్యంలోని గిరి రైతులు వ్యవశాయ పనుల్లో పలు పద్ధతులను అవలంబిస్తున్నారు. ఎవరైన షేర్ ఆటోని ప్రయాణం కోసం ఉపయోగిస్తారు. కానీ అదే షేర్ ఆటోని పంట నుర్చటానికి ఉపయోగిస్తున్నారు విశాఖ మన్యంలోని గిరి రైతులు.

షేర్ ఆటోతో పంట నూర్చిన గిరి రైతులు