విశాఖ జిల్లా కుమ్మరి కాలనీకి చెందిన ప్రణతి అనే బాలిక జుత్తాడ ప్రభుత్వ బడిలో తొమ్మిదో తరగతి చదువుతుంది. రెండు రోజుల కిందట బాలిక అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు పెందుర్తి పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులకు పూలగానిపల్లె నల్ల క్వారీ చెరువులో ఓ మృతదేహం లభ్యమైంది. దానిని పరిశీలించగా ఆ శవం తప్పిపోయిన బాలికదేనని పోలీసులు గుర్తించారు. బాలిక తల్లిదండ్రులకు సమాచారమివ్వగా.. ఘటనాస్థలానికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.
రెండు రోజుల కిందట తప్పిపోయింది..శవమై తేలింది - latest girl missing case in vishaka kummari colony
రెండు రోజుల కిందట తప్పిపోయిన బాలిక శవమై తేలిన ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
'తప్పిపోయిన బాలికదే ఆ శవం'