cannabis seized in Visakhapatnam: విశాఖలో 3,402 కిలోల గంజాయి స్వాధీనం! - గంజాయి పట్టుకున్న పోలీసులు
18:09 November 20
భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు
విశాఖ జిల్లాలో 3,402 కిలోల ఎండు గంజాయిని(cannabis seized in Visakhapatnam) పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. రెండున్న కోట్ల పైనే ఉంటుందని ఎస్ఈబీ జాయింట్ డైరక్టర్ శశి కుమార్ వెల్లడించారు. గంజాయిని రవాణా చేసిన వాహన యజమాని శ్రీను, డ్రైవర్ ఈశ్వరరావును అరెస్ట్ చేశారు.
వి.మాడుగుల పరిధిలో రవాణా చేస్తున్న ఒక వ్యాన్ సహా ఈ గంజాయి(cannabis)ని ఎస్ఈబీ సంయుక్త డైరక్టర్ శశికుమార్ నేతృత్వంలోని బృందం స్వాధీనం చేసుకుంది. నిరంతరం చేస్తున్న తనిఖీల్లో ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడడం ఇదే మొదటి సారి.
ఇదీ చదవండి:విశాఖ నుంచి మహారాష్ట్రకు గంజాయి- 1,127 కిలోలు సీజ్