విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల తాకిడికి గిరిజన గ్రామాలు అల్లాడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో పది రోజులుగా ఎడతెరిపిలేన వాన కురుస్తోంది. లంబసింగి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నర్సీపట్నం - భద్రాచలం రహదారిలో గల తురపాడ గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తూర్పు కనుమల మీదుగా ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రవాహం ఇబ్బంది కలిగిస్తోంది. ఆ ప్రాంతంలో ఓ వంతెన నిర్మించాలని ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తున్నా.. ప్రభుత్వం విస్మరిస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇంకొన్ని రోజులు విశాఖ మన్యంలో జోరుగా వర్షం పడే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
విశాఖ మన్యంలో జోరుగా వర్షం.. స్తంభించిన జనజీవనం
విశాఖ మన్యంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. లంబసింగి ఘాట్రోడ్డులో కొండచరియలు విరిగి పడి రాకపోకలకు అంతరాయం కలిగింది. తురపాడ గెడ్డ పొంగిపొర్లుతున్నందున.. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో జోరు వాన
ఇవీ చదవండి...
కోనసీమ ప్రాంతాల్లో భారీ వర్షం