ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు' - విశాఖలో పోడు భూములకు పట్టాలు

విశాఖ జిల్లాలో గిరిజనలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు అక్టోబరు 2న పట్టాలిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు.

'గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు'
'గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు'

By

Published : Sep 30, 2020, 10:39 PM IST

విశాఖ జిల్లాలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు అక్టోబరు 2న ముఖ్యంత్రి జగన్ పట్టాలు ఇవ్వనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ పట్టాలిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతారని తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పాడేరు ఐటీడీఏ సిద్ధం చేసినట్లు వివరించారు. గత నాలుగు నెలలుగా గిరిజన సంక్షేమ శాఖ, రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా పరిశీలన చేసి పట్టా పుస్తకాలు తయారు చేశారన్నారు.

2005 అటవీ భూమి హక్కుల చట్టం ద్వారా 48 ,053 మందికి 76,480 ఎకరాల పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఏజెన్సీ గిరిజనులకే కాకుండా అనకాపల్లి, నర్సీపట్నం షెడ్యూల్ ఏరియాలోని పోడు భూములకు పట్టాలు ఇస్తున్నట్లు చెప్పారు. గత పదేళ్ల కాలంలో 38 వేల మంది మాత్రమే అటవీ భూమి హక్కుల చట్టం ద్వారా లబ్ధి పొందారని...ఈ ఒక్క ఏడాదిలోనే 48 వేల 53 మందికి పట్టాలు అందిస్తున్నట్లు పీవో వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details