ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్యంలో మందుపాతరల కలకలం... నిర్వీర్యం చేసిన పోలీసులు - విశాఖపట్నం జిల్లా క్రైం

విశాఖ మ‌న్యంలో మందుపాతరలు కలకలం రేపాయి. కుంకుమపూడి-పెదపూడి రహదారిలో మావోయిస్టులు అమ‌ర్చిన రెండు మందుపాత‌ర‌ల‌ను పోలీసులు గుర్తించి, నిర్వీర్యం చేశారు.

land mine discovered in manyam vizag district
మందుపాతరను నిర్వీర్యం చేస్తున్న అధికారి

By

Published : Sep 8, 2020, 11:24 PM IST

విశాఖపట్నం జిల్లా చింత‌ప‌ల్లి ఏఎస్పీ వి.విద్యాసాగ‌ర్ నాయుడు ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక పార్టీ పోలీసు బ‌ల‌గాలు గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హించారు. గూడెం కొత్త‌వీధి మండ‌లం కుంకుమ‌పూడి-పెద‌పూడి గ్రామ అట‌వీప్రాంతంలో కాలిబాటలో అమ‌ర్చిన రెండు మందుపాత‌ర‌ల‌ను గుర్తించారు. వీటిని పోలీసులు నిర్వీర్యం చేశారు. మ‌రిన్ని మందుపాత‌ర‌లు ఉండవచ్చన్న అనుమానంతో విస్తృత గాలింపు చ‌ర్య‌లు చేపడుతున్నారు.

పెద‌పాడు-కుంకుమ‌పూడి ప్ర‌ధాన ర‌హ‌దారిలో రెండు మందుపాత‌ర‌లను నిర్వీర్యం చేయటంతో పోలీసుల‌కు, ప్రజలకు ప్ర‌మాదం త‌ప్పింది. పోలీసులే ల‌క్ష్యంగా ఈ మందుపాత‌ర‌లు ఏర్పాటు చేశార‌ని ఏఎస్పీ విద్యాసాగర్ పేర్కొన్నారు. మావోయిస్టులు త‌మ ప‌ద్ద‌తి మార్చుకోవాలని సూచించారు. ఇలాంటి చర్యలకు పాల్పడి అమాయకుల ప్రాణాలు తీయ‌వ‌ద్ద‌ని హితవు ప‌లికారు.

ABOUT THE AUTHOR

...view details