విశాఖలో లలితా జ్యువెలరీ షోరూంను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు సహా పలువురు నగర ప్రముఖులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. చిన్న స్థాయి నుంచి కోట్ల రూపాయల వ్యాపారానికి ఎదిగిన లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ నిబద్ధతతో తన వ్యాపారాన్ని విస్తరించడం వెనుక ఉన్న కృషి పట్టుదల ఎంతో ప్రశంసనీయమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొనియాడారు. వినియోగదార్లకు చేరువయ్యే విధంగా లలితా జ్యువెలరీ వ్యవహరించాలని ఆయన ఆకాంక్షించారు.
విశాఖలో లలితా జ్యువెలరీ షోరూంను ప్రారంభించిన మంత్రి అవంతి - గోపాల పట్నం
విశాఖలో లలితా జ్యువెలరీ షోరూంను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. వినియోగదార్లకు చేరువయ్యే విధంగా లలితా జ్యువెలరీ వ్యవహరించాలని ఆయన ఆకాంక్షించారు. చిన్న స్థాయి నుంచి కోట్ల రూపాయిల వ్యాపారానికి ఎదిగిన లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ పట్టుదలను మంత్రి కొనియాడారు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
విశాఖలో లలితా జ్యువెలరీ షోరూంను ప్రారంభించిన మంత్రి అవంతి
అత్యాధునిక డిజైన్లతో అందరికి పారదర్శకమైన బిల్లింగ్ విధానంలో నగలు కొనుగోలుకు సిద్ధంగా ఉంచినట్లు సంస్ధ ప్రతినిధి సురేష్ రెడ్డి వెల్లడించారు. నూతన షోరూం ప్రారంభం సందర్భంగా ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. నగల కొనుగోళ్లకు గోపాలపట్నం ప్రాంత ప్రజలు భారీగా షోరూంకు తరలివచ్చారు.
ఇదీ చదవండి: విశాఖలో బయో మైనింగ్ పనులు ప్రారంభం