ఇంట్లో చేసిన టిఫిన్ భర్త తినలేదని మనస్థాపం చెందిన మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. శారదా నగర్లో నివాసముంటున్న సత్యేంద్ర కుమార్, లీల రాజేశ్వరీకి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి బాబు, పాప ఉన్నారు. శనివారం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల్లో మనస్థాపం చెందిన రాజేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి తెలిపారు. కుటుంబ సభ్యులు అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై పట్టణ ఎస్సై రాము దర్యాప్తు చేస్తున్నారు.
టిఫిన్ తినలేదని భార్య ఆత్మహత్య - అనకాపల్లి తాజా వార్తలు
తిఫిన్ తినలేదని మనస్థాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో చోటు చేసుకుంది. ఘటనపై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
![టిఫిన్ తినలేదని భార్య ఆత్మహత్య lady suicide for not eating tiffin in anakapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6849262-86-6849262-1587234003236.jpg)
ఆత్యహత్య చేసుకున్న భార్య