విశాఖ జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లికి చెందిన మహిళా రైతు గొడుగుల అప్పలనర్స పిడుగుపడి మృతి చెందింది. అప్పలనర్స తన పొలంలో పని చేస్తుండగా.. భారీ వర్షం రావటంతో, పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లింది.ఈ సమయంలోనే పిడుగు పడటంతో అప్పలనర్స అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కాగా అప్పలనర్స భర్త కొన్నేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ పెద్దలిద్దరూ స్వల్ప కాలవ్యవధిలోనే మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పిడుగుపాటుకు మహిళా రైతు మృతి - వాడ్రపల్లి మహిళా రైతు మృతి
విశాఖ జిల్లా వాడ్రాపల్లిలో పిడుగుపడి మహిళా రైతు అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పిడుగుపాటుకు మహిళా రైతు మృతి