ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీటీల పేరుతో ఆరేళ్లుగా వ్యాపారం.. రూ.30 లక్షలతో పరారైన కుటుంబం! - lady faked villagers with the name of chits at chinamullur

విశాఖ జిల్లా యస్.రాయవరం మండలం చినగుమ్ములూరు గ్రామంలో చీటీల పేరుతో మహిళ మోసం చేసింది. లక్షల రూపాయలు కుచ్చు టోపీ పెట్టి మోసం చేసింది.

చీటీల పేరుతో ఆరేళ్లుగా వ్యాపారం.. రూ.30 లక్షలతో పరారైన కుటుంబం
చీటీల పేరుతో ఆరేళ్లుగా వ్యాపారం.. రూ.30 లక్షలతో పరారైన కుటుంబం

By

Published : Jul 3, 2020, 5:25 PM IST

విశాఖ జిల్లా యస్ రాయవరం మండలం చినగుమ్ములూరు గ్రామంలో చీటీల పేరుతో ఓ మహిళ దగా చేసింది. కూలీ పనులు చేసుకునే మహిళలను, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారిని మోసం చేసి లక్షల రూపాయలతో ఉడాయించింది. బాధితుల కథనం ప్రకారం.. మైలార్ సూర్య ప్రభావతి గత ఆరేళ్లుగా గ్రామంలో ఉంటోంది. చుట్టుపక్కల ఉండేవారిని మచ్చిక చేసుకుని చీటీల వ్యాపారం చేస్తోంది. కొన్నాళ్లపాటు డబ్బులు బాగానే ఇచ్చేది.

బాధితులు

ఈ క్రమంలో ఆమె కొందరి దగ్గర లక్షల రూపాయలు అప్పులు చేసింది. సుమారు 30 లక్షల రూపాయలకు పైగా ఆమె ఇంకా డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి.. చాలా మంది ప్రామిసరీ నోట్లు కూడా చూపిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత వైఖరి మార్చుకున్న సూర్యప్రభావతి, భర్త, పిల్లలతో కలిసి ఉడాయించిందని.. బాధితులు పోలీసులలను ఆశ్రయించారు. జరిగిన తతంగంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన యస్.రాయవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details