విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం టూటిపాల గ్రామానికి చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. ఈ మేరకు విశాఖ కలెక్టరేట్లో జరిగే స్పందన కార్యక్రమంలో వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరారు. వైఎస్సార్ చేయూత పథకానికి సంబంధించి వాలంటీర్లు తమ అనుకూల వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారని మహిళలు వాపోయారు. ఈ సందర్భంగా సచివాలయం వద్ద వాలంటీర్ల చర్యలపై వ్యతిరేక నినాదాలు చేశారు.
టూటిపాల వాలంటీర్ల చర్యలపై మహిళల ఆగ్రహం - tuttipala sachivalayam latest news
టూటిపాల సచివాలయానికి చెందిన వాలంటీర్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలకు రాజకీయ ద్వేషాలు అంటగట్టి... తమకు పథకాలు దక్కకుండా చేస్తున్నారంటూ మహిళలు వాపోయారు. ఈ మేరకు గ్రామ సచివాలయం వద్ద తమ నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు విశాఖ వెళ్లారు.
Breaking News