ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర వైఖరికి నిరసనగా.. జనవరి 27న లక్షమందితో నిరసనలు - ఆంధ్రప్రదేశ్​ తాజా వార్తలు

VISAKHA STEEL PLANT PROTEST: విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతికరేకంగా భారీ ఎత్తున నిరసనలు చేపట్టనున్నట్లు కార్మిక సంఘ నేతలు ప్రకటించారు. జనవరి 27న విశాఖలో లక్ష మందితో కార్మిక, ప్రజాగర్జన, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

VISAKHA STEEL PLANT PROTEST
VISAKHA STEEL PLANT PROTEST

By

Published : Dec 26, 2022, 10:53 AM IST

VISAKHA STEEL PLANT : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా.. జనవరి 27న భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు.. కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. విశాఖలో.. లక్ష మందితో కార్మిక, ప్రజాగర్జన, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశాఖలోని A.I.T.U.C. కార్యాలయంలో సమావేశమైన అఖిలపక్ష పోరాట సమితి నాయకులు ఈ మేరకు నిర్ణయించినట్లు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటన చేసి.. వచ్చే నెల 27నాటికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. స్టీల్‌ టౌన్‌షిప్ తృష్ణా గ్రౌండ్స్‌లో చేపట్టే ఈ కార్యక్రమాలకు.. సీఎం జగన్‌, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సహా అన్ని పార్టీల ముఖ్య నేతలను ఆహ్వానిస్తామని.. కార్మిక నేతలు వెల్లడించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర వైఖరికి నిరసనగా.. జనవరి 27న లక్షమందితో నిరసనలు

ABOUT THE AUTHOR

...view details