విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలంలోని సెజ్‌లో.. రసూల్ డెకర్ పరిశ్రమలో మునగపాక మండల ఉమ్మలాడ గ్రామానికి చెందిన రాము ఒప్పంద కార్మికుడిగా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే రాము మృతి చెందాడని ఆరోపించారు.
current shock: సెజ్‌లో విద్యుదాఘాతం.. కార్మికుడు మృతి - vizag SEZ
విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలంలోని ప్రత్యేక ఆర్థిక మండలి-సెజ్(SEZ)లో విద్యుదాఘాతానికి(current shock) గురై ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంపై మృతుడి బంధువులు ఆందోళన చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు(police) ఆందోళనకారులకు నచ్చజెప్పారు.

సెజ్‌లో విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
మృతుడి కుటుంబానికి రూ.30 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. యలమంచిలి సీఐ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబీకులతో మాట్లాడి న్యాయం చేస్తామని తెలిపారు.
ఇదీచదవండి.