ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో వైభవంగా కుమారస్వామి రథోత్సవం - కుమార స్వామి రథోత్సవం

విశాఖలోని సీలేరు కాంప్లెక్స్ డొంకరాయిలో కుమారస్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. శూలములు ధరించిన భక్తులతో కలిసి పూజారి సుబ్రహ్మణ్యం.. కుమారస్వామి రథాన్ని జలాశయం నుంచి పురవీధుల్లో ఊరేగించి ఆలయానికి తీసుకువచ్చారు.

Kumara Swamy Rathodsavam in glory
కుమార స్వామి రథోత్సవం

By

Published : Mar 29, 2021, 8:40 PM IST

విశాఖ జిల్లా సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని డొంకరాయి గ్రామంలో ప్రతి ఏటా వినాయక కుమారస్వామి ఆలయంలో కుమార స్వామి రథోత్సవాన్ని హోలీ రోజున నిర్వహించడం అక్కడి ఆనవాయితీగా వస్తుంది. దీంతో డొంకరాయి జలాశయం వద్ద స్వామి రథోత్సవాన్ని కన్నుల పండువగా జరిపారు. కుమారస్వామి మాలధారణ భక్తులతో భద్రాచలం నుంచి వచ్చిన తమిళ పూజారి సుబ్రహ్మణ్యం.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది సుమారు 58 మంది భక్తులు శూలములు ధరించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాల్లో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. దూరప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కుమార స్వామి రథోత్సవం

ABOUT THE AUTHOR

...view details