ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్నారు: వైకాపానేత కొయ్య ప్రసాద్​ - koyya prasadh reddy comments on chandrababu naidu

విశాఖలో రాజధానిని వ్యతిరేకించడంపై వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. గత రెండు దశాబ్దాల్లో తెలుగుదేశం పార్టీకి పలుమార్లు అధికారం కట్టబెట్టిన ఉత్తరాంధ్రపై... ఆ పార్టీ నాయకులు విషం కక్కుతున్నారని విమర్శించారు.

koyya prasadh reddy comments on chandrababu
వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి

By

Published : Jan 21, 2020, 2:13 PM IST

తెదేపా నాయకులు విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటారా అని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి ప్రశ్నించారు. ఎర్రన్నాయుడు బతికుంటే ఉత్తరాంధ్రకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనిచ్చేవారు కాదన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంపై విషం చిమ్మడంలో చంద్రబాబు శకునిని మించిపోతే.. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్​గా మరారని దుయ్యబట్టారు.

వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details